హాట్ టాపిక్ గా మారిన పవన్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం!

Published : Sep 18, 2019, 08:08 PM IST
హాట్ టాపిక్ గా మారిన పవన్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం!

సారాంశం

పవన్ కళ్యాణ్ తీన్మార్ చిత్రంలో నటించిన కృతి కర్బంద గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ కృతికి మంచి గుర్తింపు వచ్చింది. లంగా వోణిలో, అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కృతి నటించిన చిత్రాలు కూడా నిరాశపరిచాయి. 

కృతి కర్బంద తెలుగులో తీన్మార్, ఒంటోలు గిత్త, ఓం త్రీడి లాంటి చిత్రాల్లో నటించింది. ఇక బ్రూస్ లీ చిత్రంలో రాంచరణ్ సోదరిగా నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కృతి కర్బంద బాలీవుడ్ బాట పట్టింది. అందాలు ఆరబోస్తూ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం కృతి కర్బంద ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కృతి కర్బంద తన సహనటుడు పుల్కిట్ సామ్రాట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారట. 

ప్రస్తుతం వీరిద్దరూ పాగల్ పంటి అనే చిత్రంలో కలసి నటిస్తున్నారు. ఈ జంట గురించి జోరుగా రూమర్స్ వస్తున్నప్పటికీ కృతి కానీ, సామ్రాట్ కానీ స్పందించలేదు. గతంలో పుల్కిట్ సామ్రాట్ హీరోయిన్ యామి గౌతమ్ తో కూడా ప్రేమ వ్యవహారం సాగించినట్లు వార్తలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్