ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ హాస్య నటుడు మృతి

By Satish ReddyFirst Published Sep 10, 2020, 4:35 PM IST
Highlights

తమిళ హాస్య నటుడు వడివేల్‌ బాలాజీ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయన వయసు 45 సంవత్సరాలే. చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తీవ్ర గుండెపోటు రావటంతో మృతి చెందారు.

సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. బాలీవుడ్ లో వరుసగా ప్రముఖుల మరణ వార్తలు అభిమానులకు విషాదం కలిగిస్తుండగా సౌత్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తమిళ హాస్య నటుడు వడివేల్‌ బాలాజీ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయన వయసు 45 సంవత్సరాలే. చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తీవ్ర గుండెపోటు రావటంతో మృతి చెందారు.

ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 15 రోజుల క్రితం బాలాజీకి గుండెపోటు రావటంతో ఆయన ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. అయితే ఆసుపత్రి ఖర్చులు భరించలేక చిన్న చిన్న హాస్పిటల్స్‌లో చికిత్స చేయించిన తరువాత చివరగా చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే సరైన చికిత్స అందకపోవటంతో ఆయన మరణించినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వలివేల్‌ బాలాజీ విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ సీనియర్‌ కమెడియన్‌ వడివేలును ఇమిటేట్‌ చేస్తూ పాపులర్ కావటంతో ఆయన్ను వడివేల్‌ బాలాజీగా పిలిచేవారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న బాలాజీ చిన్నవయసులోనే మృతిచెందటంపై ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.

click me!