నీ సినిమా ఫ్లాప్ చేస్తాం.. నానికి కౌశల్ ఆర్మీ బెదిరింపులు!

By Udayavani DhuliFirst Published Sep 18, 2018, 4:45 PM IST
Highlights

సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలకు దిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాలే జరిగాయి. 

సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలకు దిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాలే జరిగాయి.

అయితే వీటిని కంట్రోల్ చేయడానికి హీరోలందరూ ఒక్కటిగా నిలుస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని అభిమానులు కూడా కలిసి ఉండాలని సూచించేవారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ కారణంగా హిట్ సినిమా ఫ్లాప్ అవ్వదు కదా.. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులే సినిమాను ఆదరిస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హోస్ట్ నానిపై విరుచుకుపడుతున్నారు.

కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ తయారైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్లు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇతర హౌస్ మేట్స్ అభిమానులను దూషించడం, విమర్శించడం వంటివి కూడా చేస్తుంటుంది కౌశల్ ఆర్మీ. హోస్ట్ నానిపై కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది ఈ ఆర్మీ. గత కొద్దిరోజులుగా నాని.. కౌశల్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో నీ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ నానిని బెదిరిస్తున్నారు.

నాని నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను టార్గెట్ చేస్తామని కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కౌశల్ ఆర్మీ తలచుకుంటే నీ సినిమా ఫ్లాప్ అంటూ వాగ్దానాలు కూడా చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!

click me!