పెద్ద సినిమాలకు పర్మెనెంట్ ప్రేక్షకులు ఉంటాయి. చిన్న సినిమాలకు టాక్ ని బట్టి ప్రేక్షకులు పుడతారు. దానికి తోడు చిన్న సినిమా రిలీజ్ రోజు ..పెద్ద సినిమా రిలీజ్ ఉంటే దానిపై ఎవరి దృష్టి ఉండదు. ఆ టాక్ తెలుసుకోవటం, దాన్ని చూడటం, ఆ పెద్ద సినిమాపై చర్చలతో మీడియా, జనం గడిపేస్తారు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
పెద్ద సినిమాలకు పర్మెనెంట్ ప్రేక్షకులు ఉంటాయి. చిన్న సినిమాలకు టాక్ ని బట్టి ప్రేక్షకులు పుడతారు. దానికి తోడు చిన్న సినిమా రిలీజ్ రోజు ..పెద్ద సినిమా రిలీజ్ ఉంటే దానిపై ఎవరి దృష్టి ఉండదు. ఆ టాక్ తెలుసుకోవటం, దాన్ని చూడటం, ఆ పెద్ద సినిమాపై చర్చలతో మీడియా, జనం గడిపేస్తారు. ఈ లోగా చిన్న సినిమా బాగుంది అనే టాక్ తెచ్చుకోగలిగితే..ఆ సాయింత్రం నుంచే హౌస్ ఫుల్స్ మొదలవుతాయి.
undefined
దీపావళి పండగ సందర్బంగా విడుదలైన ‘కర్త క్రియ కర్మ’ చిన్న సినిమానే. అయితే సర్కార్, ధగ్స్ ఆఫ్ హిందుస్దాన్ హోరులో రిలీజైన విషయం మరుగున పడింది. కానీ ఆ రెండు సినిమాలు సోసో అనిపించటంతో ఇంతకీ సినిమా ఎలా ఉంది..ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఈ చిత్రం కథేంటి...సినిమా ఎలా ఉంది..చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
ఈ చిత్రం కథేమిటంటే...
మన పుట్టుకకు కారణం ఉండకపోవచ్చు కానీ.. చావుకు మాత్రం కచ్చితంగా కారణం ఉంటుంది అనే పాయింట్‌ను బేస్ చేసుకున్న అల్లుకున్న ఈ కథలో సెల్ ఫోన్ మెకానిక్ సిద్ధు (సమీర్) ఈజీ మనీకోసం వెంపర్లాడే మనస్తత్వం. బైక్ షో రూమ్ లో జాబ్ చేసే మైత్రి (సెహర్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడతాడు. ఆమెకూడా సిద్దుపై ఇంట్రస్ట్ చూపుతుంది. ఇద్దరూ దగ్గరవుతున్న టైమ్ లో మైత్రి అక్క దివ్య సూసైడ్ చేసుకుంటుంది. ఆ సూసైడ్ వెనకున్న కారణం ఏమిటో తెలుసుకునేందుకు తనకు సాయం చేయమంటుంది మైత్రి. మరో ప్రక్క.... ఈ ఆత్మహత్యకూ, సిటీలోలో ఇంకో రెండు సూసైడ్స్ జరుగుతాయి.
వాటికి మొదట జరిగిన దివ్య సూసైడ్ కు ... దగ్గరి సంబంధం ఉంటుంది. అవి ఆత్మహత్యలు కావని, వాటి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం రివీల్ అవుతుంది. పోలీస్ అధికారులు ఆ కేసును క్రైం బ్రాంచ్‌కి చెందిన రవితేజ(రవివర్మ)కి అప్ప చెప్తారు. ఆ ఇన్విస్టిగేషన్ లో ఎవరూ ఊహించని నిజాలు బయటపడతాయి. వాటికి హీరోకు లింక్ ఉందా...టైటిల్ లో చెప్పబడ్డ కర్త, కర్మ, క్రియ ఎవరు? సిద్ధు వాళ్లని పట్టుకున్నాడా? ఈ కేసు విషయంలో రంగంలోకి దిగిన రవితేజ (రవివర్మ) ఎలాంటి క్లూలు సంపాదించాడు? అనేదే మిగతా కథ.
పాయింట్ మంచిదే..
టెక్నాలిజీ రోజు రోజుకీ మన జీవితాల్లోకి పెనువేగంగా దూసుకువచ్చేస్తోంది. టెక్నాలజీ ఎంత సుఖ పెడుతోందో...అదే స్దాయిలో సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. అవకాశవాదుల,అత్యాశవాదులు చేతికి మన సెల్‌ఫోన్ వెళితే..పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయి అనే విషయం దర్శకుడు చెప్పదలిచారు. నిజంగా ఈ తరానికి కావాల్సిన పాయింట్ ఇది. కానీ దాని ఎగ్జిక్యూషనే బాగోలేదు.
ఎలా ఉంది..
చిన్న సినిమాలు యావరేజ్ గా ఉంటే కష్టం. బాగుండాలి..ప్రేక్షకుల చేత అబ్బో అనిపించాలి ..లేకపోతే అబ్బే అనేస్తారు. ఎందుకంటే ఆ సినిమాల్లో స్టార్ కాస్ట్ ఉండదు..భారీగా విజువల్స్ ఉండవు..కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్ముకోవాలి. కంటెంట్ రిచ్ గా ఉంటే మిగతావన్ని ప్రక్కనపెట్టి జనం జై కొడుతున్నారు. అయితే చిన్న సినిమా దర్శకులు చాలా మంది ఈ విషయం మర్చిపోతున్నారు. దాంతో తాము ఒక్కరమే కాకుండా టీమ్ మొత్తాన్ని వెనక్కి లాగేస్తున్నారు. అదే పరిస్దితి ‘కర్త క్రియ కర్మ’ ఎదురైంది.
మహిళల పై ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న అత్యంత దారుణమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తన సినిమా కాన్సెప్ట్ గా రాసుకున్న దర్శకుడు, ఆ కాన్సెప్ట్ కు తగ్గట్లు కథ,స్క్రీన్ ప్లే మాత్రం ఇంట్రస్టింగ్ గా రాసుకోవడంలో విఫలమైయ్యాడనే చెప్పాలి. చాలా సీన్స్ లో అసలు విషయమే ఎలివేట్ కాలేదు. ముఖ్యంగా హీరోని ప్రక్కన పెట్టి సెకండాఫ్ మొత్తం రవివర్మతో నడిపి..అతన్ని హీరో చేసినట్లుగా అనిపించింది.
ఎవరెలా చేసారు..
కానీ ఈ సినిమా ద్వారా తెలుగులో ఓ మంచి హీరో దొరికాడని మాత్రం చెప్పచ్చు.ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన వసంత్ సమీర్... లుక్స్, ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా ఉన్నాడు. బాగున్నాడు. బేస్ వాయిస్ ఆయనకు ప్లస్ అయ్యింది. తన నటనతో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడని చెప్పటం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హీరోయిన్ తో చేసిన సీన్స్ గాని, క్లైమాక్స్ సీన్స్ గాని వసంత్ సమీర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా మంచి ఈజ్ తో చేసుకుంటూపోయారు. హీరోయిన్ గా కూడా బాగా చేసింది.
టెక్నికల్ గా ...
టెక్నాలిజీ గురించి మాట్లాడిన ఈ సినిమా ..టెక్నికల్ గా అంత సౌండ్ గా లేదు. ఇలాంటి కథలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. కెమెరా వర్క్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ వర్క్ అలాగే ఉంది. డైలాగుల్లో కొన్ని బాగున్నాయి.
ఫైనల్ ధాట్
చిన్న సినిమాలకు కర్త,కర్మ,క్రియ ..మూడు స్క్రిప్టే. దాన్ని మర్చిపోతే చూసేవాడి, తీసినోడి ఖర్మ కాలటం ఖాయం.
-------------------------------------
రేటింగ్: 2/5
తెర వెనక..ముందు
నటీనటులు: వసంత్ సమీర్, సహెర్ అఫ్షా, రవి వర్మ, ‘జబర్దస్త్’ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాథ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
కూర్పు: ప్రవీణ్ పూడి
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగు గవర
విడుదల తేదీ: 08-11-2018