
బిగ్‌బాస్ షో క్యాన్సిల్ అయ్యింది. ఇంకా పూర్తవకుండానే షోని రద్దు చేశారు నిర్వహకులు. అదేంటి ఇంకా బిగ్‌బాస్ షోనే ప్రారంభం కాలేదు, అప్పుడే రద్దేంటి? అనే డౌట్ వస్తోంది కదా? అయితే బిగ్‌బాస్ షో రద్దయ్యింది మనవద్ద కాదు, కన్నడలో. ప్రస్తుతం అక్కడ `బిగ్‌బాస్8` సీజన్ నడుస్తుంది. సుదీప్ హోస్ట్ గా రన్ అయ్యే ఈ షో గతేడాది ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా వల్ల ఆలస్యమైంది. ఫిబ్రవరి 28న స్టార్ట్ చేశారు. దాదాపు 71 రోజులు నడిచింది. ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి షోని రద్దు చేస్తున్నట్టు కలర్స్ టీవీ యాజమాన్వం ప్రకటించింది.
బెంగుళూర్‌లో కరోనా భారీగా విస్తరిస్తుంది. సీటీలోనే వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో నిర్వహకులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే హౌజ్‌లో ఎవరికీ కరోనా లేకపోయినప్పటికీ కేసులో భారీగా నమోదవుతున్న నేపథ్యంలో విన్నర్ ఎవరో తేల్చకుండానే షోని రద్దు చేసింది. ఇంకా నెల రోజుల ముందే షోని రద్దు చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. అయితే ఈ షో ప్రారంభంలోనే హోస్ట్ సుదీప్ అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో షోకి దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆయన మళ్లీ షోలో జాయిన్ అయ్యారు. ఇంతలోనే రద్దు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేల్చకపోవడంతో అభిమానులు మరింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్ సమయంలో బిగ్‌బాస్ షోని చూస్తూ ఎంటర్‌టైన్ అవ్వాలనుకున్న వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. విన్నర్‌ని సైతం ప్రకటించకపోవడంతో వారు తోచిన వ్యక్తిని విన్నర్‌గా చెబుతున్నారు. ఈ లెక్కన ప్రశాంత్ సమ్ బర్డీని విన్నర్‌గా డిక్లేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం విశేషం.