విషాదం.. యువ నటుడు నితిన్ గోపీ మృతి.. ఎలా జరిగిందంటే?

By Asianet NewsFirst Published Jun 3, 2023, 3:21 PM IST
Highlights

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నడ యువ నటుడు తాజాగా కన్నుమూశారు. ఆయన మరణవార్త అందరినీ షాక్ గురిచేస్తోంది. 
 

ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, సీనియర్ నటుడు శరత్ బాబు మరణించిన విషయం తెలిసిందే. వారి వెంటనే ‘ప్రాణం ఖరీదు’ సీనియర్ దర్శ్కుడు కే వాసు కూడా తుది శ్వాస విడిచారు.  ఇలా ఒకరి తర్వాత ఒకరి హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా మరో యువ నటుడు ప్రాణాలో కోల్పోవడం బాధాకరం.

కన్నడ యువ నటుడు నితిన్ గోపీ (Nithin Gopi)  39వ ఏటా మరణించారు. శుక్రవారం రాత్రి నితిన్ అకాల మరణం చెందారు. దీంతో శాండల్ వుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే, నిన్న రాత్రి నితిన్ కు గుండుపోటు రావడంతో వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందరుతూ పరిస్థితి విషమించి మరణించారు. నితిన్ అకాల మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

కాగా, నితిన్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్ తో ఈ లోకాన్నే విడిచి పెట్టి వెళ్లారు. నితిన్  చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను ప్రారంభించారు. ముత్తినంత హఎంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నితిన్ ‘హర హర మహాదేవ్’ భక్తి సీరియల్ లోనూ కొన్ని ఎపిసోడ్లలో నటించారు. అదేవిధంగా తమిళంలోని కొన్ని సిరీయల్స్ లోనూ నటించి మెప్పించారు. త్వరలో నితిన్ దర్శకత్వంలోనే ఓ సీరియల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇలా జరిగింది.

click me!