
బాలీవుడ్ లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అని పేరు తెచ్చుకున్నారు హీరో అమీర్‌ఖాన్. ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చడ్డా. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కీలకపాత్రలో నటించి.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. హాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన ది ఫారెస్ట్ గంప్ కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే లాల్ సింగ్ చడ్డా సినిమాపై వివాదం నడుస్తోంది. ఈ సినిమాను బహిష్కరించాలంటూ గత కొన్నిరోజులగా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన్ సినిమాను బాయకాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై రీసెంట్ గా అమీర్ స్పందించి నా సినిమాకు వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించొద్దంటూ ఆడియన్స్ ను వేడుకున్నారు.
ఇక చాలా మంది అమీర్ ను విమర్షిస్తుంటే.. కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు... ఇక రీసెంట్ గా ఈ విషయం పై స్పందించారు.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానారనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో అమీర్‌ను విమర్శిస్తూ ఓపోస్ట్ చేసింది. లాల్ సింగ్ చడ్డా సినిమాపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వెనుక అమీర్‌ఖాన్ మాస్టర్ మైండ్ ఉంది. ఈ ఏడాది హిందీ సినిమాలు బాగా ఆడలేదు. సౌత్ సినిమాలే ఇండియా కల్చర్‌ను అద్దం పట్టి సక్సెస్‌ను సాధించాయి. ఈ క్రమంలో ఒక హాలీవుడ్ రీమేక్ ఎలాగూ ఆడదు. అందుకే ఈ విషయంలో అమీర్ తెలివిగా ప్రవర్తిస్తున్నారు అని విమర్షించింది.
ఇక పనిలో పనిగా హిందీ సినిమా మేకర్స్ కు కంగనా క్లాస్ పీకింది. హిందీ సినిమాలు మన ఆడియన్స్ పల్స్‌ను అర్థం చేసుకోలేక పోతున్నాయి. వాటిని మన మేకర్స్ సరిదిద్దాలి. ముఖ్యంగా.. ఇది హిందువు లేదా ముస్లిం అని కాదు. అమీర్‌ఖాన్ హిందూ ఫోబిక్ ఇండియాలో అసహనం ఎక్కువైందని అన్నప్పటికి అతని సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు దీనిని మత అంశంగా చిత్రీకరించడం ఆపండి అంటూ అమీర్‌పై విమర్శలు కురిపించింది. ఇక ప్రస్తుతం కంగనా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అమీర్ ఖాన్ ఏమని స్పందిస్తాడో చూడాలి మరి.