కాంచన 3.. కొట్టడానికి రెడీ!

Published : Jan 19, 2019, 06:53 PM ISTUpdated : Jan 19, 2019, 06:56 PM IST
కాంచన 3.. కొట్టడానికి రెడీ!

సారాంశం

ముని సీక్వెల్స్ తో బాక్స్ ఆఫీస్ లకు కొత్త పాటలను నేర్పిన దర్శకుడు నటుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు మరో సీక్వెల్ తో రెడీ అయ్యాడు. బాక్స్ ఆఫీస్ ను గట్టిగా కొట్టాలనే పట్టుదలతో గత కొంత కాలంగా కాంచన 3 రిలీజ్ ను వాయిదా వేస్తూన్న రాఘవ ఇప్పుడు డేట్ ను ఎనౌన్స్ చేశాడు. 

సమ్మర్ లోనే సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా చెప్పేశాడు. ఏప్రిల్ 18న కాంచన 3 సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. పోస్టర్ లో లారెన్స్ లుక్ సరికొత్తగా ఉండడంతో అది కాస్త వైరల్ అయ్యింది.  ఓవియా, వేదిక సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రాఫిక్స్ విషయంలో లారెన్స్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈ సినిమాను లారెన్స్ తో పాటు కళానిధి మారన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి కాంచన 3 సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్