కమల్‌ హాసన్‌ రిలీజ్ చేసిన `సీయూ సూన్‌` ట్రైలర్‌.. అమెజాన్‌ లో సినిమా విడుదల

Published : Aug 25, 2020, 01:22 PM IST
కమల్‌ హాసన్‌ రిలీజ్ చేసిన `సీయూ సూన్‌` ట్రైలర్‌.. అమెజాన్‌ లో సినిమా విడుదల

సారాంశం

సీయూ సూన్‌ సినిమా సెప్టెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రీమియర్‌ కానుంది. మహేష్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యూ, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన సీయూ సూన్ సినిమా ట్రైలర్‌ను లోక నాయకుడు కమల్‌ హాసన్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సీయూ సూన్‌ సినిమా సెప్టెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రీమియర్‌ కానుంది. మహేష్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యూ, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సబిన్‌ ఉరలికండి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ దర్శకత్వంలో ఫహద్‌ చేస్తున్న రెండో సినిమా కావటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా లాక్‌ డౌన్‌ సమయంలో తెరకెక్కించటం విశేషం. సినిమా రిలీజ్‌కు సంబంధించిన విశేషాలను అమెజాన్‌ ప్రైమ్‌ తన సోషల్ మీడియా పేజ్‌లోనూ షేర్ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు