బిగ్ బాస్ 3 కోసం షూటింగ్ లో స్టార్ హీరో!

Published : May 10, 2019, 03:49 PM IST
బిగ్ బాస్ 3 కోసం షూటింగ్ లో స్టార్ హీరో!

సారాంశం

నటుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి షూటింగ్ లతో బిజీ అయిపోయారు. 

నటుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి షూటింగ్ లతో బిజీ అయిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసిన కమల్ హాసన్ ఇప్పుడు శాసన సభ ఉపఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆయన సినిమా, టీవీ షూటింగ్ లంటూ బిజీ అయిపోయారు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళంలో రెండు సీజన్ లను హోస్ట్ చేసిన ఆయన మూడో సీజన్ కి రెడీ అయిపోతున్నారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా సీజన్ 3 ప్రోమో షూటింగ్ చెన్నైలో బుధ, గురువారాల్లో జరిగింది. అందులో కమల్ హాసన్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సీజన్ లో పాల్గొనబోయే పోటీదారులను ఎంపిక చేస్తున్నారు. జూన్ నెల రెండో వారం నుండి ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం కానుంది. 

PREV
click me!

Recommended Stories

Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Jailer 2 OTT: ఓటీటీలో జైలర్ 2 అన్‌కట్ వెర్షన్.. 30 నిమిషాల ఎక్స్ట్రా సీన్లు, ఆ హీరోల అభిమానులకు పండగే ?