Latest Videos

చంద్రబాబు, పవన్‌ గెస్ట్ లుగా `కల్కి 2898 ఏడీ` మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక.. ఎప్పుడు? ఎక్కడ?

By Aithagoni RajuFirst Published Jun 16, 2024, 6:06 PM IST
Highlights

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి 2898  ఏడీ` త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. ఆ విషయాలు క్రేజీగా మారాయి. 
 

ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో `కల్కి 2898ఏడీ` మూవీ రూపొందింది. మరో పది రోజుల్లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ప్రభాస్‌ నటించిన ఈ మూవీ కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. ఇటీవలే ట్రైలర్‌ని విడుదల చేశారు. దీనికి స్పందన బాగానే ఉంది. ఓవర్సీస్‌లో బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. సినిమా విజువల్‌ వండర్‌లా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. దీంతో మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇక ఈ మూవీకి సంబంధించిన `బుజ్జి`ని పరిచయం చేసేందుకు భారీ ఈవెంట్‌ని నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం యానిమేషన్‌ వీడియో కోసం మరో చిన్న ఈవెంట్‌ని నిర్వహించారు. ఇక ప్రమోషన్స్ ని మరింత ఎఫెక్టీవ్‌గా చేయబోతున్నారు. భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.

నిర్మాత ఈ ఈవెంట్‌కి సంబంధించి భారీ ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీలో దీన్ని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ ఈవెంట్‌ని ఏపీ రాజధాని అమరావతిలో ప్లాన్‌ చేస్తున్నారట. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇక ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని ఆహ్వానించబోతున్నారట. ఈ ఇద్దరు గెస్ట్ లుగా అత్యంత గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించేందుకు నిర్మాత అశ్వనీదత్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్తనెట్టింట వైరల్‌ వుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ నెల20, 21లలో ప్లాన్‌ చేస్తున్నారట. పవన్‌, ప్రభాస్‌ ఒకేవేధికపై అంటే ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న `కల్కి 2898 ఏడీ` సినిమాలో ప్రభాస్‌ భైరవ పాత్రలో నటిస్తున్నారు. అశ్వత్థామగా అమితాబ్‌ కనిపించబోతున్నారు. కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన వంటివారు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న ఈ మూవీ విడుదల కాబోతుంది. 
 

click me!