ఆగస్ట్ 15: కాజల్ డబుల్ టార్గెట్

Published : Jul 17, 2019, 09:37 AM IST
ఆగస్ట్ 15: కాజల్ డబుల్ టార్గెట్

సారాంశం

కాజల్ కెరీర్ మరో లెవెల్ కి వెళ్ళడానికి డేట్ సెట్టయింది. ఒకేరోజు కాజల్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.   

సౌత్ సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ పేరు టాప్ లో ఉంటుంది. 2004 నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ చందమామ నిత్యం ఎదో ఒక సినిమాతో బిజీగా ఉంటోంది. అయితే అప్పుడపుడు హీరోయిన్స్ కెరీర్ లో ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే ఆ కిక్ మాములుగా ఉండదు. 

కాజల్ నుంచి కూడా ఇప్పుడు అలాంటి సీన్ దర్శనమివ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కాజల్ కి ఇప్పుడు విజయం చాలా అవసరం. అయితే ఆగస్ట్ 15న అమ్మడు రెండు సినిమాలతో తన లక్కుని పరీక్షించుకోనుంది. జయం రవితో కలిసి నటించిన కామెడీ తమిళ్ డ్రామా రిలీజ్ కు రెడీ అయ్యింది. 

ఇక శర్వానంద్ తో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రణరంగం కూడా విడుదలకు సిద్ధమైంది. రెండు సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నాయి. దీంతో బేబీ కెరీర్ కి ఆ ఒక్కరోజే కీలకం కానుంది. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గుతున్న తరుణంలో అమ్మడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..