తొలిముద్దు అతడితోనే : జాన్వీకపూర్

By AN TeluguFirst Published Apr 25, 2019, 3:12 PM IST
Highlights

దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది.

దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి కూడా నచ్చేవారు ఉంటారు కదా.. వారెవరో తాజాగా ఓ టీవీ షోలో వెల్లడించింది.

నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న 'బీఎఫ్ విత్ వోగ్' షోలో జాన్వీ పాల్గొంది. షోలో భాగంగా ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని ప్రశ్నించగా.. ''విక్కీ కౌశల్'' పేరు చెప్పింది.

'ఉరి' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న విక్కీ కౌశల్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. జాన్వీ నటిస్తోన్న 'తక్త్' సినిమా ఆమెకి జోడీగా నటించేది విక్కీ కౌషలే.. సో కో స్టార్ కాబట్టే అతడి పేరు చెప్పి ఉంటుందని అంటున్నారు. 

click me!
Last Updated Apr 25, 2019, 3:12 PM IST
click me!