ఆ సంగతి అసలు ఊహించలేదంటున జాతి రత్నాలు హీరోయిన్

By team teluguFirst Published Mar 20, 2021, 3:28 PM IST
Highlights

జాతి రత్నాలు మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఆమె అసలు ఊహించలేదట. అలాగే ఆమెకు జాతి రత్నాలు చిత్రం ద్వారా ఈ స్థాయి గుర్తింపు వస్తుందని కూడా అనుకోలేదట. జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించడం ఆనందంగా ఉందని ఆమె అంటున్నారు. 

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో జాతి రత్నం మూవీ ఓ సంచలనం. ఊహించినదానికి పదిరెట్లు విజయాన్ని జాతి రత్నాలు నమోదు చేసింది. నాన్ స్టాప్ కామెడీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్నారు జాతి రత్నాలు యూనిట్. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన జాతి రత్నాలు స్టార్ హీరోల సినిమా రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక యూఎస్ లో కూడా జాతి రత్నాలు వన్ మిలియన్ డాలర్స్ వసూళ్ల వైపుకు దూసుకు వెళుతుంది. 


హీరో నవీన్ పోలిశెట్టి నటన, రాహుల్, ప్రియదర్శి సపోర్ట్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. డెబ్యూ డైరెక్టర్ అనుదీప్ రాసుకున్న కామెడీ, టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. మొత్తంగా జాతి రత్నాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించారు. 


నవీన్ పోలిశెట్టి లవర్ చిట్టి పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. అయితే జాతి రత్నాలు మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఆమె అసలు ఊహించలేదట. అలాగే ఆమెకు జాతి రత్నాలు చిత్రం ద్వారా ఈ స్థాయి గుర్తింపు వస్తుందని కూడా అనుకోలేదట. జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించడం ఆనందంగా ఉందని ఆమె అంటున్నారు. జాతి రత్నాలు చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.
 

click me!