ఈమద్య కాలంలో ఉప్పెన తర్వాత ఆ స్దాయి సక్సెస్ ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.ఫుల్ లెంగ్త్ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ కు, అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్ బిజీ అయ్యారు.

ఇక హీరోకు సైడ్ కిక్స్ గా చేసిన కమెడియన్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు కూడా ప్రస్తుతం మోస్ట్ బిజీ కమెడియన్స్ గా టర్న్ అయ్యిపోయారు. మరి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పరిస్దితి ఏమిటి...అంటే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఓ పెద్ద సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...ఫరియా అబ్దుల్లా.. హీరో రవితేజ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆమెతో సినిమా టీమ్ చర్చలు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్ . త్రినాథ్ రావు నక్కినా ఈ చిత్రానికి దర్శకుడు. అయితే, మెయిన్ హీరోయిన్ కోసమా లేదా మరేదైనా ఇంపార్టెంట్ పాత్ర కోసమా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఫరియా అబ్దుల్లా కూడా సముఖంగానే ఉన్నట్లు సమాచరం. త్వరలోనే ఈ మూవీ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో రవితేజ స్లమ్ లో ఉండే యువకుడిగా కనపడనున్నారు. కార్పోరేట్ వ్యవస్దపై ఆయన పోరాటం చేస్తారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నాడు రవితేజ. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.