నవీన్‌ పొలిశెట్టికి బెస్ట్ యాక్టర్‌ అవార్డు.. వాచ్‌మెన్‌ అందుకున్న వైనం.. ఇది కూడా కామెడీయేనా?

Published : Aug 10, 2021, 11:31 AM IST
నవీన్‌ పొలిశెట్టికి బెస్ట్ యాక్టర్‌ అవార్డు.. వాచ్‌మెన్‌ అందుకున్న వైనం.. ఇది కూడా కామెడీయేనా?

సారాంశం

నవీన్‌ హీరోగా తెలుగు నటించిన మొదటి సినిమా `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`. ఈ చిత్రానికిగానూ నవీన్‌కి `దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌` బెస్ట్ యాక్టర్‌ అవార్డు వరించింది.

నవీన్‌ పొలిశెట్టి ఇటీవల `జాతిరత్నాలు` సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా యాభై కోట్లకుపైగా కలెక్షన్లని  రాబట్టింది. ఇందులో నవీన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, ప్రియదర్శి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అందుకే ఆడియెన్స్ కరోనాని లెక్క చేయకుండా బ్రహ్మారథం పట్టారు. ఇదిలా ఉంటే నవీన్‌ హీరోగా తెలుగు నటించిన మొదటి సినిమా `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`. ఈ కామెడీ చిత్రం సైతం సూపర్‌ హిట్‌ అందుకుంది.

అయితే ఈ చిత్రానికిగానూ నవీన్‌కి `దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌` బెస్ట్ యాక్టర్‌ అవార్డు వరించింది. నటుడిగా బెస్ట్ యాక్టర్‌ అవార్డు వచ్చిన విషయాన్ని నవీన్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే కరోనా కారణంగా ఈ ఈవెంట్‌ జరగలేదు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహకులు డైరెక్ట్ గా ఈ అవార్డుని నవీన్‌ ఇంటికి పంపించారట. కానీ అక్కడ తను లేడు. దీంతో ఆ ఇంటి వాచ్‌మెన్‌ ఈ అవార్డుని తీసుకున్నారట. ఈ విషయాన్ని నవీన్‌ కామెడీగా చెబుతూ అవార్డు ఫోటోలు పంచుకున్నారు. 

`ఈ రోజు ఇది(అవార్డు) ఇంటికి వచ్చింది. `ఏజెంట్‌` సినిమాకిగానూ బెస్ట్ యాక్టర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్ ఇది. కరోనా కారణంగా ఫెస్టివల్‌ జరగలేదు. దీంతో వాళ్లు దీన్ని ఇంటికి పంపించారు. ఇంట్లో ఎవరూ లేరు. దీంతో మా వాచ్‌మెన్‌ అవార్డుని తీసుకున్నాడు. దీంతో మా బిల్డింగ్‌లో అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు` అని పోస్ట్ పెట్టాడు నవీన్‌. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 

నెటిజన్లు ఓ రేంజ్‌లో దీనిపై కామెంట్లు చేస్తున్నారు. `ఆల్‌ ది బెస్ట్ వాచ్‌మెన్‌గారు మీ భవిష్యత్‌ ప్రాజెక్ట్ లకు`, `అందరు వాచ్‌మెన్లు ప్రతిభతోనే పుడతారు. వాళ్లు ఆస్కార్‌కి అర్హులు`, `నువ్వు చివరి నీ వాచ్‌మెన్‌ కూడా అవార్డు పొందేలా చేశావ్‌. అది నీ నైజాం అన్నా..` అంటూ సెటైరికల్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. చివరికి అవార్డులోనూ కామెడీ చేశావ్‌ పో అని, అవార్డులపై కామెడీనా అంటూ కొందరు చురకలు కూడా అంటిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరోయిన్ వల్ల పరువు పోయింది.. ఓపెన్‌గా చెప్పేసిన నటుడు రవిబాబు
అప్పుడు మహేష్ బాబు పక్కకు పిలిచి మరీ తిట్టాడు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్..