విజయ్ 63: ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published : Jun 06, 2019, 01:52 PM IST
విజయ్ 63: ఇంట్రెస్టింగ్ అప్డేట్

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ 63వ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అట్లీ విజయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తేరి - మెర్సల్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం రానున్న ఈ కాంబినేషన్ పై సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

అయితే జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు టైటిల్ - విజయ్ లుక్ వంటి విషయాలను బయటపెట్టని చిత్ర యూనిట్ ఆ రోజు అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా సర్‌ప్రైజ్ ను ప్లాన్ చేస్తోంది. 

ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం అనంతరం మళ్ళీ విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్. ఇక సినిమాను దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?