నాగ చైతన్యకు పొంచివున్న ప్రమాదం!

Published : Jul 05, 2019, 05:14 PM ISTUpdated : Jul 05, 2019, 05:35 PM IST
నాగ చైతన్యకు పొంచివున్న ప్రమాదం!

సారాంశం

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస ప్లాపుల్లో ఉన్న చైతూకు మజిలీ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. 

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస ప్లాపుల్లో ఉన్న చైతూకు మజిలీ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దీనితో తదుపరి చిత్రాలకు ఉత్సాహంగా సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం చైతు, విక్టరీ వెంకటేష్ కలసి వెంకీ మామలో నటిస్తున్నారు. 

ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. జైలవకుశ తర్వాత బాబీ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. రియల్ లైఫ్ మామా అల్లులైన చైతు, వెంకీ రీల్ లైఫ్ లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. చిత్రం సరదాగా ఉంటేనే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటుందని టాక్. 

వెంకీ మామ చిత్ర కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. వెంకీ మామ చిత్రంలో జ్యోతిష్యం చాలా కీలకం కానుందట. వెంకటేష్, చైతు  జ్యోతిష్యం చుట్టూ తిరుగుతాయట. నాగ చైతన్య సినిమా మొత్తం ప్రమాదాలు ఎదుర్కొంటుంటాడని.. అది వెంకటేష్ వల్లే అని అంటున్నారు. ఈ పాయింట్ ని దర్శకుడు బాబీ చాలా సరదాగా డీల్ చేస్తున్నాడట. 

ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్
ఒక్క రాత్రికి 3 కోట్లు.. శిల్పా శెట్టి రెస్టారెంట్ ఆదాయం తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే ?