వ్యవసాయం మొదలెట్టిన నిర్మాతకు మహేష్ విషెష్

By Prashanth MFirst Published May 12, 2019, 12:41 PM IST
Highlights

స్టార్స్ చేసే సినిమాలు ఎక్కువ మందికి చేరుతాయి. అందులో విషయం ఎప్పుడూ చర్చనీయాంసంగా మారుతుంది.  ఏదన్నా సందేశం ఉంటే అది జనాలకు రీచ్ అవుతుంది. గతంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సమయంలో ఆ సినమా నుంచి ఉత్తేజం పొందిన వారు ఊళ్లను దత్తత తీసుకున్నారు.

స్టార్స్ చేసే సినిమాలు ఎక్కువ మందికి చేరుతాయి. అందులో విషయం ఎప్పుడూ చర్చనీయాంసంగా మారుతుంది.  ఏదన్నా సందేశం ఉంటే అది జనాలకు రీచ్ అవుతుంది. గతంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సమయంలో ఆ సినమా నుంచి ఉత్తేజం పొందిన వారు ఊళ్లను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మహర్షి సినిమా నుంచి  చాలా మంది ప్రేరణ పొంది వీకెండ్ వ్యవసాయాలు మొదలెడుతున్నారు. ఇది ఆనందకరపరిణామం. మహేష్ బాబు చాలా ఆనందపడుతున్నారు. 

‘బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. కానీ వాటిలోని సందేశాన్ని ప్రేక్షకులు అర్థంచేసుకుని పాటించినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. వీకెండ్‌ వ్యవసాయానికి మంచి స్పందన వస్తోంది. బంగారు భవిష్యత్తుకు ఇది గొప్ప ప్రారంభం. మన తరానికే కాదు భావితరాలకు కూడా. ఇంతటి గొప్ప బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నందుకు మధుర శ్రీధర్‌, అమిత్‌ సజానేలను అభినందించాలి’ అని పేర్కొన్నారు.   

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. సినిమాలో రైతుల విలువను తెలియజేస్తూ  చూసేవారిలో మంచి ఆలోచన రేకెత్తేలా తెరకెక్కించారు దర్శకుడు వంశీ పైడిపల్లి.  ఈ సినిమా నుంచి స్ఫూర్తిపొంది ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి పొలంలోకి అడుగుపెట్టటం జరగింది. 

‘రైతులకు సానుభూతి అవసరం లేదు. వారికి మన గౌరవం దక్కాలి. ‘మహర్షి’ సినిమా ఓ మంచి ఆలోచనను కలిగించింది. రైతుల కష్టాలను తెరపై నిజాయతీగా చూపించినందుకు మహేశ్‌, వంశీ, దిల్‌రాజును అభినందించాలి. నాకు వీకెండ్‌ వ్యవసాయం అన్న కాన్సెప్ట్‌ చాలా నచ్చింది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి’ అని ట్వీట్‌ చేస్తూ పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నారు. 

అలాగే ఈ సిసిమాని చూసి అమిత్‌ సజానే అనే నెటిజన్‌ కూడా స్ఫూర్తి పొందారు. పొలం పనులు చేస్తున్న ఫొటోను మహేశ్‌కు, ‘మహర్షి’ చిత్రబృందానికి ట్యాగ్‌ చేస్తూ.. ‘పుడిమికి మనిషికి మధ్య ఉన్న గొప్ప అనుబంధమే వ్యవసాయం. ‘మహర్షి’ సినిమా నుంచి స్ఫూర్తిపొందాను’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్స్‌ చూసిన మహేష్  వారిని అభినందించారు.

click me!