ఇలియానా సినిమా... ఓటీటి డైరెక్ట్ రిలీజ్

By Surya PrakashFirst Published Jun 15, 2020, 9:15 AM IST
Highlights

అమితాబ్ బచ్చన్ నటించిన "గులాబో సితాబో" డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా వ్యూయర్ షిప్ బాగుంది.దాంతో ఆ ఉత్సాహంతో  ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణం పెట్టుకున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఆ సిమా పేరు "బిగ్ బుల్". ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్దితి ఇండస్ట్రీని ఓటీటి వైపుగా పరుగులు తీయిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఈ విషయంలో ముందడగు వేస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ నటించిన "గులాబో సితాబో" డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా వ్యూయర్ షిప్ బాగుంది.దాంతో ఆ ఉత్సాహంతో  ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణం పెట్టుకున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఆ సిమా పేరు "బిగ్ బుల్". ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

స్టార్ బ్రోకర్ హర్షద్ మెహతా లైఫ్ స్టోరిని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడున్న పరిస్దితిలో అక్టోబర్ లో థియోటర్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే క్లారిటీ లేదు. ఓపెన్ అయినా వరసపెట్టి పెద్ద సినిమా రిలీజ్ లు ఉన్నాయి. దానికి తోడు  ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగుంది. వాళ్లే నిర్మాతల చుట్టు తిరిగి సినిమాలు కొంటున్నారు. అవన్ని ప్రక్కన పెడితే.. అభిషేక్ బచ్చన్ సినిమా అంటే మార్కెట్లో కొనే నాధుడు లేడు. ఆయన సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ లేదు. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో స్ట్రీమింగ్ కోసం "బిగ్ బుల్" ను వదిలేసారు. 

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ హాట్ స్టార్ సంస్థ  దక్కించుకుంది. త్వరలోనే తమ యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది.  అజయ్ దేవగన్ నిర్మించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయినా క్రేజ్ రాలేదు. మొత్తానికి అలా ఇలియానా సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చేస్తోందన్నమాట.

click me!