ఇలియానా మళ్లీ జంప్!

By Udayavani DhuliFirst Published Nov 19, 2018, 11:31 AM IST
Highlights

రవితేజ నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ భావించారు కానీ ఈ బ్యూటీ మళ్లీ బాలీవుడ్ కి చెక్కేసింది. ఓ హిందీ సినిమాకు కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

అనీస్ బజ్మీ అనే దర్శకుడు రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించడంతో అగ్రిమెంట్ కూడా రాసుకున్నారని తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడితో కలిసి పని చేసిన అనుభవం ఉండడంతో అతడి తాజా సినిమాకు కూడా సై అంది.

జాన్ అబ్రహం హీరోగా కనిపించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కారణంగా ఇలియానాకి మళ్లీ తెలుగులో గ్యాప్ తప్పేలా లేదు. పైగా ఆమె గ్లామరస్ రోల్స్ కాకుండా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

ఇలియానా అంటే గ్లామర్ కోసమేనని చాలా మంది అభిప్రాయం. పైగా ఆమె నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో మరోసారి అమ్మడు బాలీవుడ్ కి జంప్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ తెలుగులో ఈ బ్యూటీ ఎప్పుడు కనిపిస్తుందో..?

click me!