82ఏళ్ల వయసులో ఆమెలా ఉండాలనుకుంటున్నా

Published : Jun 16, 2021, 11:22 AM IST
82ఏళ్ల వయసులో ఆమెలా ఉండాలనుకుంటున్నా

సారాంశం

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అడివి శేషు ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ 82ఏళ్ల వయసులో బరువులు ఎత్తుతూ, ఫిట్ నెస్ లో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. 

యంగ్ హీరో అడివి శేషు విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నారు. ఆయన నటించిన క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. ఉత్కంఠ రేపే మలుపులతో సాగే ఎవరు అడివి శేషు కెరీర్ కి మంచి పునాది వేసింది. అడివి శేషు టాలెంట్, స్టోరీ సెలక్షన్ నమ్మి మహేష్ బాబు లాంటి స్టార్ తన బ్యానర్ లో అవకాశం ఇచ్చాడంటే మాములు విషయం కాదు. 


మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ మూవీలో అడివి శేషు నటిస్తున్నారు.  దర్శకుడు శశి కిరణ్ తిక్కా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది. అలాగే నాని నిర్మాతగా హిట్ 2 మూవీలో హీరోగా అడివి శేషు ఎంపికయ్యారు. గత ఏడాది విడుదలైన 'హిట్' చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కనుంది. 


ఇక సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అడివి శేషు ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ 82ఏళ్ల వయసులో బరువులు ఎత్తుతూ, ఫిట్ నెస్ లో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. సదరు మహిళకు సంబంధించిన న్యూస్ షేర్ చేసిన అడివి శేషు, 82ఏళ్ల వయసులో నేను కూడా ఆమెలా ఉండాలని అనుకుంటున్నా, అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్