తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Rashi Khanna: రాశి ఖన్నాకు పెళ్లా? క్లారిటీ ఇచ్చేసిందిగా!

Sambi Reddy | Published : Feb 17, 2023 1:39 PM

రాశి ఖన్నా పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకే సినిమాలు తగ్గించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రాశి ఖన్నా స్పందించారు.   


ఫార్జీ రూపంలో రాశి ఖన్నా భారీ హిట్ కొట్టింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ క్రైమ్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అండ్ 2 సక్సెస్ తర్వాత వరుసగా మూడో సిరీస్ తో విజయం అందుకున్నారు. ఫార్జీ వెబ్ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు.అమెజాన్ ప్రైజ్ లో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ అవుతుంది. రాశి ఖన్నాకు ఫార్జీ గుర్తింపు  తెచ్చింది. ఈ సక్సెస్ బాలీవుడ్ లో ఆఫర్స్ తెచ్చిపెడుతుందని రాశి నమ్ముతున్నారు. 

ఈ సందర్భంగా రాశి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే పెళ్లి వార్తలపై స్పందించారు. మీరు సినిమాలు చేయడం తగ్గించారు. పెళ్లి చేసుకునే ఆలోచనతోనే కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని యాంకర్ అడిగారు. నేను వివాహం చేసుకోబోతున్నానన్న వార్తల్లో నిజం లేదు. అలాగే నేను సినిమాలు చేయడం తగ్గించలేదు. 

తెలుగు, తమిళ భాషల్లో కొన్ని కథలు విన్నాను. ఫార్జీ విడుదల బిజీలో వాటిపై నిర్ణయం తీసుకోలేదు. చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్స్ త్వరలో ప్రకటిస్తాను... అని చెప్పుకొచ్చారు. దీంతో రాశి పెళ్లి వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చింది. రాశి ఖన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా యోధ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తుంది. జులైలో ఈ చిత్రం విడుదల కానుంది. యోధ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. 

ఊహలు గుసగుసలాడే మూవీతో వెలుగులోకి రాశి ఖన్నా... జిల్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కొన్నాళ్లుగా ఆమెకు టాలీవుడ్ లో కలిసి రావడం లేదు.వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ఆమె గత చిత్రాలు వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ రాశి మీద ఆసక్తి తగ్గించారనిపిస్తుంది. రెండేళ్ల నుండి తమిళంలో రాశి ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. 
 

click me!