Kangana Ranaut: నేను ఆ హీరోయిన్స్ వలె రాత్రుళ్ళు హీరోల రూమ్స్ కి వెళ్ళలేదు..!

Published : Feb 28, 2023, 05:56 PM ISTUpdated : Feb 28, 2023, 06:15 PM IST
Kangana Ranaut: నేను ఆ హీరోయిన్స్ వలె రాత్రుళ్ళు హీరోల రూమ్స్ కి వెళ్ళలేదు..!

సారాంశం

కంగనా రనౌత్ మరోసారి రెచ్చిపోయారు. బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్స్ చేశారు. కంగనా కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి.   

కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దలంటే తోక తొక్కిన త్రాచులా లేస్తుంది. సందర్బంగా ఉన్నా లేకుండా తన అసహనం బయటపెడుతుంది. స్టార్ కిడ్స్ ఆమెకు నచ్చరు. నెపోటిజానికి వ్యతిరేకి. ఇక బాలీవుడ్ లో పాతుకుపోయిన మాఫియా ఇతరులను ఎదగనివ్వడం లేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను ఆమె తీవ్రంగా ఖండించారు. బాలీవుడ్ మాఫియా అతని అవకాశాలు లాగేసుకొని మానసిక వేదనకు కారణమయ్యారని కంగనా ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా పోస్ట్స్ తో చిన్నపాటి ఉద్యమం నడిపారు. 

ఇక కంగనా తాజా ట్వీట్ అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఆమె హీరో హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. ''ఈ బాలీవుడ్ మాఫియా నా యాటిట్యూడ్ ని తలపొగరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నేను మిగతా హీరోయిన్స్ మాదిరి కులకుతూ ఎంటర్టైన్ చేయను. ఐటమ్స్ సాంగ్స్ చేయను. చీరలు కట్టుకొని డాన్సులు చేయను. హీరోలు పిలవగానే వెళ్లి రాత్రుళ్ళు వాళ్ళ గదుల్లో గడపను. అందుకే నన్ను ఒక పిచ్చిదానిగా ప్రొజెక్ట్ చేసి జైలుకి పంపాలని చూస్తున్నారు' అంటూ ఒక ట్వీట్ చేశారు.

మరొక ట్వీట్లో ఈ యాటిట్యూడ్ నాకు పేరెంట్స్ నుండి వచ్చింది. నేను స్టార్ హీరోయిన్ అయినా కూడా మా అమ్మగారు వ్యవసాయం చేస్తారు. నేను ధనవంతురాలినైనా తాను రైతుగానే భావిస్తుంది. నా తల్లి 25 ఏళ్ళు టీచర్ గా పని చేశారు. నా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని... ఆమె వెల్లడించారు. బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ కంగనా ట్వీట్ ప్రకంపనలు రేపుతున్నాయి. 

కాగా గత ఏడాది కంగనా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ధాకడ్ విడుదలైంది. ఈ చిత్రం ఆడలేదు. అనూహ్యంగా కంగనా చంద్రముఖి 2లో ఆఫర్ దక్కించుకున్నారు. అలాగే మరో మూడు హిందీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. కంగనా రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. జయలలిత బయోపిక్ తలైవిలో కంగనా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రభాస్ కి జంటగా ఏక్ నిరంజన్ మూవీ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?