షూటింగ్ లో ప్రియాంక తలకు గాయం!

Published : Aug 28, 2021, 08:14 AM IST
షూటింగ్ లో ప్రియాంక తలకు గాయం!

సారాంశం

షూటింగ్ లో తాను గాయాలపాలైన విషయాన్ని ప్రియాంక స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో రెండు ఫొటోలు పోస్టు చేసిన ప్రియాంక వాటిలో తనకు తగిలిన గాయం ఎక్కడుందో చెప్పాలని అభిమానులను కోరింది. 


ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి తరువాత హాలీవుడ్ కి చెక్కేసింది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో అక్కడే సెటిల్ అయ్యారు. న్యూ యార్క్ సిటీలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి, బర్త్ నిక్ జోనాస్ తో కాపురం పెట్టింది అమ్మడు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఆమె. తాజాగా 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే లండన్ లో 'సిటాడెల్' ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రియాంక గాయపడింది. 


షూటింగ్ లో తాను గాయాలపాలైన విషయాన్ని ప్రియాంక స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో రెండు ఫొటోలు పోస్టు చేసిన ప్రియాంక వాటిలో తనకు తగిలిన గాయం ఎక్కడుందో చెప్పాలని అభిమానులను కోరింది. కొందరు అభిమానులు తప్పుగా సమాధానం చెప్పడంతో, ప్రియాంక కనుబొమ్మపై తగిలిన గాయాన్ని చూపి, అదే నిజమైన గాయం అని వెల్లడించింది.

కాగా 'సిటాడెల్' లో ప్రియాంక ఓ గూఢచారి పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో పెడ్రో లియాండ్రో, రిచర్డ్ మాడెన్ వంటి హాలీవుడ్ తారాగణం కనువిందు చేయనుంది. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. హాలీవుడ్ లో విజయవంతమైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్ర నిర్మాతలు రూసో బ్రదర్స్ ఈ 'సిటాడెల్' వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్