హీరోయిన్ పై వల్గర్ హెడ్డింగ్... క్షమాపణ చెప్పాలంటూ విశ్వక్ సేవ్ వార్నింగ్!

By team teluguFirst Published Feb 23, 2021, 12:29 PM IST
Highlights

ఓ హీరోయిన్ గురించి తప్పుగా థంబ్ నైల్ పెట్టిన కారణంగా విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. ఆ థంబ్ నైల్ పెట్టిన యూట్యూబర్, నందితా శ్వేతకు క్షమాపణలు చెవుతూ 24గంటల్లో వీడియో పోస్ట్ చేయాలనీ, లేదంటే ఇంటికి వెళ్లి మరీ అతనికి బుద్ది చెవుతా అన్నాడు. తాను ఎన్ని పనులలో ఉన్నా... అతని గురించి పట్టించుకుంటా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 

హీరో విశ్వక్ సేన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి వార్నింగ్ ఇచ్చి వార్తలలో నిలిచారు. ఓ హీరోయిన్ గురించి తప్పుగా థంబ్ నైల్ పెట్టిన కారణంగా ఆయన ఫైర్ అయ్యారు. నందితా శ్వేతా హీరోయిన్ గా అక్షర పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ మూవీలోని ఒక సాంగ్ ని హీరో విశ్వక్ సేన్ లాంఛ్ చేశారు. దీనితో చిత్ర యూనిట్ ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ నందితా శ్వేతా... 'విశ్వక్ నీకు ఏమి కావాలన్నా అడుగు, సిగ్గు లేకుండా ఇచ్చేస్తా..' అని అన్నట్లు థంబ్ నైల్ పెట్టి ఒకరు యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ థంబ్ నైల్ విశ్వక్ సేన్ దృష్టికి రావడంతో ఆయన ఆవేశానికి గురయ్యాడు. ఓ ప్రత్యేక వీడియో ద్వారా సదరు యూట్యూబర్ కి వార్నింగ్ ఇచ్చాడు. 


తమ ఇంటిలో కూడా ఆడవాళ్లు ఉంటారని, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్లకు ఎలా బాధ కలుగుతుందో.. అందరికీ అలాగే బాధ కలుగుతుందని విశ్వక్ అన్నాడు. ఆ థంబ్ నైల్ పెట్టిన యూట్యూబర్, నందితా శ్వేతకు క్షమాపణలు చెవుతూ 24గంటల్లో వీడియో పోస్ట్ చేయాలనీ, లేదంటే ఇంటికి వెళ్లి మరీ అతనికి బుద్ది చెవుతా అన్నాడు. తాను ఎన్ని పనులలో ఉన్నా... అతని గురించి పట్టించుకుంటా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 


ఇక హిట్ మూవీతో డీసెంట్ హిట్ కొట్టిన విశ్వక్ ప్రస్తుతం పాగల్ మూవీ చేస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా పాగల్ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి ఆదరణ దక్కింది.  
 

click me!