కుర్ర హీరోతో సీనియర్ నటి బ్రేకప్..?

By AN TeluguFirst Published Jun 14, 2019, 12:56 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే డేటింగ్, బ్రేకప్ లు ఎక్కువగా జరిగేవి. 

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే డేటింగ్, బ్రేకప్ లు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద కుటుంబం నుండి  హీరోయిన్ గా పరిచయమైంది ఓ బ్యూటీ. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రీసెంట్ గా ఓ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సీనియర్ నటి చాలా కాలంగా ఓ కుర్ర హీరోతో డేటింగ్ చేస్తోంది.

వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్. ఈ మధ్యకాలంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఎన్నో ఏళ్లుగా సీక్రెట్ గా మైంటైన్ చేసన రిలేషన్ ఒక్కసారిగా బయట ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం.

సదరు కుర్రహీరో తిరిగి తన తల్లితండ్రుల దగ్గరకి వచ్చేశాడట. ఆ హీరోయిన్ తన ఇంట్లో ఒంటరిగానే ఉంటోందట. ఒకరికొకరు ఎదురుపడినా.. కనీసం పలకరించుకోవడం లేదట. ఇలాంటి పరిస్థితికి దారి తీసిన సంఘటనలు ఏంటనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కొన్ని కథలకు అంతే.. హ్యాపీ ఎండింగ్స్ ఉండవు. 

click me!