ఆర్ ఆర్ ఆర్ నిర్మాతకు అవమానం?.. అంతర్జాతీయ వేదికపై దానయ్య పేరు ప్రస్తావించని కీరవాణి!

By Sambi ReddyFirst Published Jan 11, 2023, 9:35 AM IST
Highlights

ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య పేరు కీరవాణి ప్రస్తావించలేదు. ఎంత గొప్ప దర్శకుడైనా... ఆయన ఆలోచనలు సినిమాగా రూపొందాలంటే డబ్బులు కావాలి. దర్శకుడి ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చే ముడిసరుకు నిర్మాత సమకూర్చాలి. అలాంటి ఒక కీలక వ్యక్తి, విభాగం పేరు ప్రతిష్టాత్మక వేదికపై ప్రస్తావించకపోవడం దారుణ పరిణామం. 


ఆర్ ఆర్ ఆర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక ఘనంగా ముగిసింది. ఇండియాకు చెందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో నామినేషన్స్ సాధించిగా ఒక అవార్డు సొంతమైంది. గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్ 'నాటు నాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపిక చేశారు.సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. నామినేషన్స్ లో ఉన్న మిగతా మూడు సాంగ్స్ ని వెనక్కి నెట్టి ' నాటు నాటు' అవార్డు కైవసం చేసుకుంది. 

అవార్డు అందుకున్న కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ ని అవార్డుకి ఎంపిక చేసిన గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన కీరవాణి... ఈ ఆనందాన్ని తన భార్య శ్రీవల్లితో పంచుకుంటున్నట్లు తెలిపారు.  ఈ అవార్డు వాస్తవంగా ఎవరికి దక్కుతుందో ప్రాధాన్యతల వారీగా చెప్పుకొచ్చారు. మొదటి ప్రయారిటీ దర్శకుడు రాజమౌళికి, నెక్స్ట్ సాంగ్ కి కొరియోగ్రఫీ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి ఇచ్చాడు. తర్వాత తన కొడుకు కాల భైరవకు ఇచ్చాడు. ఇక వరుసగా సింగర్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఈ అవార్డు చెందుతుంది అన్నారు. 

MM Keeravaani’s acceptance Speech!! ❤️‍🔥❤️‍🔥 pic.twitter.com/9q7DY7Pn5G

— RRR Movie (@RRRMovie)

చివరికి సాంగ్ ప్రోగ్రామర్స్ ని కూడా ఆయన తలచుకున్నాడు. అయితే సినిమా నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్మాతను ఆయన మర్చిపోయారు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య పేరు కీరవాణి ప్రస్తావించలేదు. ఎంత గొప్ప దర్శకుడైనా... ఆయన ఆలోచనలు సినిమాగా రూపొందాలంటే డబ్బులు కావాలి. దర్శకుడి ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చే ముడిసరుకు నిర్మాత సమకూర్చాలి. అలాంటి ఒక కీలక వ్యక్తి, విభాగం పేరు ప్రతిష్టాత్మక వేదికపై ప్రస్తావించకపోవడం దారుణ పరిణామం. నిర్మాత దానయ్యకు ఇది పెద్ద అవమానం. 

ఆర్ ఆర్ ఆర్ సినిమాను రాజమౌళి ఓన్ చేసుకున్నారు. కర్త కర్మ క్రియా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సినిమా విజయంలో వందశాతం క్రెడిట్ ఆయనే తీసుకుంటున్నారు. మీడియా, సొసైటీ, సినిమా వర్గాల ఆలోచనలు అలానే ఉన్నప్పుడు ఆయన తప్పులేదు. అయితే ఏ అంతర్జాతీయ వేదికపై మాట్లాడినా ఆయన దానయ్య పేరు ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్స్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ప్రస్తావన మాత్రమే తెస్తున్నారు. అంత పెద్ద వేదికపై కీరవాణి డివివి దానయ్య పేరు మర్చిపోయారని చెప్పలేం. కావాలనే పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. డివివి దానయ్యకు బదులు రాజమౌళి సన్నిహితుడైన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ కి తీసుకుపోవడం కొసమెరుపు.  
 

click me!