రామ్ చరణ్ ని దాటేసిన విజయ్ దేవరకొండ.. గీతగోవిందం మరో రికార్డ్!

Published : Nov 15, 2018, 03:44 PM IST
రామ్ చరణ్ ని దాటేసిన విజయ్ దేవరకొండ.. గీతగోవిందం మరో రికార్డ్!

సారాంశం

విజయ్ దేవరకొండ - రష్మిక మందాన జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

విజయ్ దేవరకొండ - రష్మిక మందాన జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే పెట్టిన బడ్జెట్ కు అత్యధిక లాభాలను అందించిన చిత్రంగాను గీతగోవిందం నిలిచింది. 

ఈ సినిమా థ్రియేటికల్ వాల్యూ 15కోట్లు. అయితే సినిమా విడుదలైన తరువాత అతివేగంగా 50కోట్ల షేర్స్ ను అందుకుంది. మొత్తంగా 70కోట్లవరకు లాభాలను అందించింది. ఇకపోతే బుల్లితెరపై కూడా ది బెస్ట్ ఫిల్మ్ గా గీతగోవిందం నిలిచింది. రీసెంట్ గా జీ తెలుగులో మొదటిసారి ప్రసారమైన ఈ సినిమా 20.8 TRPని అందుకొని 2018లోనే అత్యధిక రేటింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. 

ఇక ఇటీవల మా టీవీలో రంగస్థలం సినిమా కూడా ప్రసారం కాగా ఆ చిత్రం 19.5 రేటింగ్ ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ సినిమా కంటే విజయ్ దేవరకొండ సినిమా ఎక్కువ రేటింగ్ అందుకోవడం చూస్తుంటే అతని స్టార్ డమ్ స్టార్ హీరోల స్థాయికి వచ్చేసిందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ టాక్సీ వాలా సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది.  

PREV
click me!

Recommended Stories

Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు