స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్ చూశారా..?

Published : Mar 25, 2019, 10:04 AM IST
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్ చూశారా..?

సారాంశం

బాలీవుడ్ నటి దీపిక పదుకొన్ ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. ఈ సినిమాకు 'ఛాపక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

బాలీవుడ్ నటి దీపిక పదుకొన్ ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. ఈ సినిమాకు 'ఛాపక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ ని దీపిక ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.'

'ఈ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఛాపక్ సినిమా చిత్రీకరణ ఈరోజు నుంచే మొదలు'' అని పోస్ట్ పెట్టింది. దీపిక లుక్ బయటకి రాగానే ఆమె అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు. నెటిజన్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో దీపిక క్యారెక్టర్ పేరు దీపిక మాలతి. లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ అయినప్పటికీ పేరు మార్చడం గమనార్హం. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో దీపికకి జోడీగా విక్రాంత్ మస్సె నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?