చిరంజీవి మూవీ రిజెక్ట్ చేయడం వెనుక కారణం చెప్పిన సాయి పల్లవి

By team teluguFirst Published Sep 22, 2021, 5:51 PM IST
Highlights

చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి ఓ రోల్ రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అందుకు కారణం వివరించారు సాయి పల్లవి. 

మరో రెండు రోజుల్లో లవ్ స్టోరీ థియేటర్స్ లో సందడి చేయనుంది. దీనితో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. హీరో నాగ చైతన్య, సాయి పల్లవి , దర్శకుడు శేఖర్ కమ్ముల పలు ఇంటర్వ్యూలలో పాల్గొనడం జరిగింది. ఇక లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రావడం జరిగింది. 


కాగా నేడు మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న సాయి పల్లవి లవ్ స్టోరీ మూవీ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అదే విధంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశారు. అయితే చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి ఓ రోల్ రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించడం జరిగింది. 


ఈ నేపథ్యంలో అందుకు కారణం వివరించారు సాయి పల్లవి. ఆమె మాట్లాడుతూ.. రీమేక్ చిత్రాలకు నేను వ్యతిరేకం కాను. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయినప్పుడు మరో భాష ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. రీమేక్‌లో అప్పటికే ఒకరు చేసిన పాత్రను చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ పాత్ర కంటే బెటర్ చేయాలనే ఒత్తిడి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఫ్రెష్‌గా చేస్తే నా వైపు నుంచి ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అందుకే నేను రీమేక్ పాత్రలకు కొంచెం దూరంగా ఉంటాను. లూసిఫర్ రీమేక్ చిత్రంలో చిరంజీవి ఆఫర్ రిజెక్ట్ చేయడం వెనుక మరే కారణం లేదు. నా వరకు పాత్ర గొప్పగా ఉండాలి అనుకొంటాను అని సాయిపల్లవి ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

click me!