గుడిలో ప్రముఖ నిర్మాత సూసైడ్!

Published : Jan 17, 2019, 10:03 AM IST
గుడిలో ప్రముఖ నిర్మాత సూసైడ్!

సారాంశం

మరాఠీ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు సదానంద్ లాడ్ అలియాస్ పప్పులాడ్ ముంబైలో ఓ దేవాలయంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు.

మరాఠీ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు సదానంద్ లాడ్ అలియాస్ పప్పులాడ్ ముంబైలో ఓ దేవాలయంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. బిల్డర్ వేధింపులే ఆత్మహత్యకి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

పప్పులాడ్(58) ముంబైలో తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. గిర్గాంలో తన ఇంటికి దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి రోజూ వెళ్తుండేవారు. బుధవారం నాడు కూడా అలానే ఆలయానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న తరువాత ఆలయ పూజారితో కాసేపు మాట్లాడి పక్కన ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారట.

కాసేపు తరువాత పూజారి గదిలోకి వెళ్లి చూడగా పప్పులాడ్ ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించారు. అప్పటికే ఆయన మరణించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుడిజేబులో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. ప్రముఖ బిల్డర్ వేధింపుల కారణంగా ఆయన సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తమకు ఎంతో  ధైర్యాన్నిచ్చే పప్పులాడ్ సూసైడ్ చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే
BMW vs Anaganaga Oka Raju: రవితేజకి నవీన్‌ పొలిశెట్టి బిగ్‌ షాక్‌.. `అనగనగా ఒక రాజు`కి ఊహించని కలెక్షన్లు