రకుల్ ప్రీత్ సింగ్ స్మోకింగ్ కు బలైపోతున్న సెలెబ్రిటీ జంట!

Published : Jul 10, 2019, 03:40 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ స్మోకింగ్ కు బలైపోతున్న సెలెబ్రిటీ జంట!

సారాంశం

తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. యువతని ఆకట్టుకునే అందంతో పాటు నటన, చలాకీతనం ఉండడంతో రకుల్ కు స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. 

తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. యువతని ఆకట్టుకునే అందంతో పాటు నటన, చలాకీతనం ఉండడంతో రకుల్ కు స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇటీవల రకుల్ కు బాలీవుడ్ లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. అజయ్ దేవగన్ సరసన నటించిన దే దే ప్యార్ దే చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ అదరగొట్టేసింది. 

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు 2లో నాగార్జునతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో రకుల్ పాత్ర పేరు అవంతిక. రకుల్ పాత్రని పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో రకుల్ పాత్రపై విమర్శలు మొదలయ్యాయి. టీజర్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్మోకింగ్ చేస్తూ కనిపించడంతో ఆమె అభిమానులే ఆగ్రహానికి గురవుతున్నారు. 

సోషల్ మీడియాలో రకుల్ ని తిడుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ కనిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి చిత్రంలో నటిస్తున్నాడని అసలు ఊహించలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చూస్తుంది ఇది వల్గర్ కామెడీతో కూడిన బి గ్రేడ్ సినిమాల అనిపిస్తోంది అంటూ మాతో అభిమాని విమర్శించాడు. 

ఇక ఈ వివాదంలో నెటిజన్లు దర్శకుడు రాహుల్ రవీంద్రన్, చిన్మయి జంటని కూడా వదలడం లేదు. చిన్మయి ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ని విమర్శిస్తూ కామెంట్స్ చేసింది. నీ భర్త తెరకెక్కిస్తున్న మన్మథుడు 2 మాటేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పాత్రని సమర్థిస్తావా అంటూ చిన్మయికి నెటిజన్లు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?