వరణ్ తేజ పాత్రలో అర్జున్ కపూర్, మరి వెంకీ పాత్రకు?

By Udaya DFirst Published Apr 6, 2019, 5:30 PM IST
Highlights

యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ "ఎఫ్-2" . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలో విజేతగా నిలిచి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ "ఎఫ్-2" . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలో విజేతగా నిలిచి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) రూపొందిన ఈ చిత్రాన్ని  ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు. 

హిందీలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనీష్ అజ్మీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. అలాగే వరుణ్ తేజ్ పాత్రలో బోనీకపూర్ కుమారుడు అర్జున్ కపూర్ కనిపంచనుండగా, వెంకటేష్ పాత్రకు అనీల్ కపూర్ కానీ మరో సీనియర్ హీరో గానే చేసే అవకాసం ఉందని సమాచారం.

హిందీ రీమేక్ లో మిగతా నటీనటులు, ఇతర టెక్నిషియన్లు తదితర విషయాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభించింది. హిందీకు దేవినే అడుగుతున్నారని, ఇవే పాటలు అక్కడ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. 

ఇక హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహ్రీన్ గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా..తమన్నానే హింది వెర్షన్ కు చేసే అవకాసం ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో నిర్మితమైన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే మరి ఈ చిత్రానికి హిందీలో కొద్ది పాటి నేటివిటి మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. మరి బాలీవుడ్ లో ఈ సినిమాకు  ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

click me!