ప్రముఖ నిర్మాత ఇంట్లో రెండు రోజులుగా ఈడీ సోదాలు.. ధనుష్, శివకార్తికేయన్ తో సినిమాలు చేస్తున్న అతడు ఎవరంటే 

Published : May 17, 2025, 05:41 PM IST
ప్రముఖ నిర్మాత ఇంట్లో రెండు రోజులుగా ఈడీ సోదాలు.. ధనుష్, శివకార్తికేయన్ తో సినిమాలు చేస్తున్న అతడు ఎవరంటే 

సారాంశం

తమిళ సినిమా నిర్మాత ఆకాష్ భాస్కరన్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.

తమిళ సినిమాలో ప్రముఖ నిర్మాతగా ఎదుగుతున్న ఆకాష్ భాస్కరన్ ఇంట్లో రెండు రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆయన ఇంట్లో నిన్న ఉదయం 6.15 నుంచి 7.30 వరకు సోదాలు జరిగాయి. సోదాల్లో వాడిన వాహనం నెంబర్ PY-01 DC-1951. ఏ కారణంతో సోదాలు జరిగాయి, ఏమైనా స్వాధీనం చేసుకున్నారా అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

ఆకాష్ భాస్కరన్ ఎవరు?

ఆకాష్ భాస్కరన్ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. దనుష్ నిర్మించిన 'నానుం రౌడీ దాన్' సినిమాలో విఘ్నేష్ శివన్‌కి అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'కాతువాకుల రెండు కాదల్', 'అమరన్' చిత్రాలకు పనిచేశారు పనిచేశారు.

స్టార్ హీరోల సినిమాలు నిర్మాణం

'డాన్ పిక్చర్స్' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ నడుపుతున్న ఆకాష్, దనుష్ 'ఇడ్లీ కడై', శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, అథర్వ - కయాదు లోహర్ నటిస్తున్న 'ఇధయం మురళి', సింబు నటిస్తున్న 49వ సినిమా లాంటి మరికొన్ని సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mehreen Pirzada: ఎంగేజ్మెంట్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. అభిమానులకు షాక్ ఇచ్చిన మెహరీన్
Karthika Deepam 2 Today Episode: ఆపేరషన్ జ్యోత్స్న-త్వరలో పెళ్లి- రంగం సిద్ధం చేసిన కార్తీక్