దిశా పటానితో షురూ చేసిన ప్రభాస్... కల్కి 2829 AD అప్డేట్!

Published : Feb 21, 2024, 06:12 PM IST
దిశా పటానితో షురూ చేసిన ప్రభాస్... కల్కి 2829 AD అప్డేట్!

సారాంశం

ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కల్కి 2829 AD. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా దిశా పటాని-ప్రభాస్ లపై సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం.   

కెరీర్లో మొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2829 AD తెరకెక్కుతుంది. వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెజెండ్స్ కల్కి చిత్రంలో కీలక రోల్స్ చేస్తున్నారు. దేశంలోనే టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్ గా చేస్తుంది. 

కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో దిశా పటాని-ప్రభాస్ మీద ఓ సాంగ్ షూట్ చేస్తున్నారట. ఈ మేరకు సమాచారం అందుతుంది. కాగా కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఒకపక్క షూటింగ్ జరుగుతుండగా.. మరో ప్రక్క డబ్బింగ్, విఎఫ్ఎక్స్ సైతం పూర్తి చేస్తున్నారట. 

కల్కి మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కల్కి చిత్రాన్ని రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కల్కితో పాటు ప్రభాస్ రాజా సాబ్ చిత్రం చేస్తున్నారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చేస్తుస్తారని టాక్. ప్రభాస్ సలార్ 2కి కూడా కమిట్ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhanush vs Vignesh: ధనుష్‌తో గొడవపై నయన్‌తార భర్త ఓపెన్‌.. ఆయనతో నాన్నని చూసుకుంటానంటూ ఎమోషనల్‌
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు