ట్రోలింగ్ పై స్పందించిన దిశా పటాని!

Published : Apr 26, 2019, 04:11 PM IST
ట్రోలింగ్ పై స్పందించిన దిశా పటాని!

సారాంశం

సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు దూరం బాగా తగ్గింది. 

సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు దూరం బాగా తగ్గింది. ఏ విషయాన్నైనా నేరుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ప్రశ్నిస్తున్నారు. అలానే ట్రోలింగ్ కూడా పెరిగిపోయింది. నెటిజన్లకు సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయం దొరికినా ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.

అలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా టార్గెట్ చేసే వారిలో నటి దిశా పటాని కూడా ఒకరు. ఆమె ఓ ఇన్నర్ గార్మెంట్స్ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో తరచూ లోదుస్తులు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుంటుంది.

చాలా మంది దిశాని ఈ విషయంలో ట్రోల్ చేస్తుంటారు. తాజాగా తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారిని పట్టించుకోనని, అటువంటి విషయాలపై అసలు శ్రద్ధ పెట్టనని చెప్పింది.

ఆన్ లైన్ లో చాలా మంది తమ లైఫ్ లో హ్యాపీగా లేని వాళ్లు ఫ్రస్ట్రేషన్ తో అటువంటి కామెంట్స్ చేస్తుంటారనివాటిని పెద్దగా పట్టించుకోనని కేవలం పాజిటివ్ విషయాల మీదనే దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'భారత్' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?