సురేంద‌ర్ రెడ్డి నెక్ట్స్ వెంకీతో కాదా? ఆ తమిళ హీరోతోనా!

By Surya Prakash  |  First Published Oct 30, 2023, 3:26 PM IST


తమిళ హీరోలతో సినిమాలు చేయటానికి మన దర్శకుడు ఉత్సాహం చూపుతున్నారు. సూర్యతో బోయపాటి శ్రీను ఓ ప్రాజెక్టు రెడీ చేస్తున్నట్లే ..ఇప్పుడు సురేంద్ర రెడ్డి దృష్టి సైతం ఓ తమిళ హీరోపై పడినట్లు సమాచారం.


ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లు  ఒకరిగా సురేందర్ రెడ్డి( Surender Reddy)వెలిగారు.  ఈయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సక్సెస్ అందుకున్నాయి. అయితే గత కొంతకాలంగా ఆయన మ్యాజిక్ భాక్సాఫీస్ దగ్గర పని చేయటం లేదు. సైరా సినిమా ఫెయిల్యూర్ తర్వాత గ్యాప్ తీసుకుని ఆయన రీసెంట్ గా తీసిన ఏజెంట్ సినిమా ప్లాప్ అవ్వడం ఆయన అభిమానులను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఆయన తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడుతో చేయబోతున్నారనే విషయం అంతటా హాట్ టాపక్ గా మారింది. పవన్ కళ్యాణ్ తో సినిమా లాంచ్ అయ్యినా ఆ సినిమా ముందుకు ఇప్పుడప్పుడే వెళ్లదని తేలింది. 

పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ లేటవడంతో.. పలువురు యంగ్ హీరోలతో టచ్‌లోకి వెళ్ళాడు.  సాయి ధరమ్ తేజ్‌,వరుణ్ తేజ్ లకి సురేందర్ రెడ్డి   కథలు  చెప్పారన్నారు. అయితే అవీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత వెంకటేష్ ని కలిసి ఓ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్లు వినపడింది. అయితే వెంకీ తో కూడా లేటు అయ్యేలా ఉందని తమిళ స్టార్ విక్రమ్ కు ఓ కథ చెప్పారని వినికిడి. విక్రమ్ కు సైతం తమిళ,తెలుగు భాషల్లో కలిపి ఒకే సారి సినిమా చెయ్యాలని ఉంది. దాంతో ఆ యాక్షన్ కథకు విక్రమ్ సరే అన్నట్లు    చెప్తున్నారు. అయితే త‌న కొత్త సినిమా `తంగ‌ళ‌న్` కోసం చిక్కటంతో బాడీ పికప్ చేసి సురేంద్రరెడ్డి సినిమా కు వస్తానని చెప్పారట. 
వాస్తవానికి, రామ్ చరణ్‌తోనూ ఓ సినిమా చేయాల్సి వుంది సురేందర్ రెడ్డి.! ఏం జరుగుతుందో చూడాలిక.

Latest Videos

మరో ప్రక్క సురేంద్రరెడ్డి...అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేయిస్తున్నట్టు గా తెలుస్తుంది. ఆ సబ్జెక్టు   పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథగా తెలుస్తుంది…  గతంలో  వీళ్ళ కాంబో లో వచ్చిన రేసు గుర్రం( Race Gurram )ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ కథ నచ్చితే అదే నమ్మకం తో అల్లు అర్జున్ కూడా ఈయనతో సినిమా తీయడానికి రెడీ అవుతారు అనటంలో సందేహం లేదు.
 

click me!