రెమ్యునరేషన్ నామ మాత్రంగా ఖర్చులకు ఇచ్చినా పుచ్చుకోవాలి. ఈ లెక్కలు ప్రకారం ఇప్పుడు మెహర్ రమేష్ కు రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ మీదున్నారు. యంగ్ హీరోలకు దీటుగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో మరో సినిమాలోనూ నటిస్తున్నారు. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. తాజా చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మాస్ కే బాస్’ అనే రేంజ్‌లో చిరు 153వ సినిమా టైటిల్, ప్రీలుక్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. మరోవైపు మెహర్ రమేష్, బాబీ సినిమాలు కూడా ఆయన ప్రకటించారు.
ఇక చిరు, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఫస్ట్‌లుక్‌ను మహేష్ బాబు చేత విడుదల చేయించారు. కరోనా సమయంలో చిరు తరఫున బాధ్యత తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను నడిపించడంతో మెహర్ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశం దక్కింది. తమిళ హిట్ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. నెలవారీ జీతం రూ.5 లక్షల చొప్పున తీసుకుంటున్నారట. అలానే సినిమా విడుదలైన తరువాత వచ్చే లాభాల్లో 20 శాతం వాటా తీసుకునేలా ఎగ్రిమెంట్ కుదిరిందట.
గతంలో మెహర్ రమేష్ తెరకెక్కించిన 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కానీ టాలీవుడ్ పెద్దలతో అతడికి మంచి రిలేషన్స్ ఉండటమే కలిసొచ్చింది. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు ఈ డైరెక్టర్. ‘తల’ అజిత్, శివ డైరెక్షన్లో వచ్చిన ‘వేదాళం’ సినిమా అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడంతో ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట చిరంజీవి అండ్ టీమ్.