సంపూతో క్రిష్ సినిమా తీయబోతున్నాడా..?

Published : Sep 03, 2019, 05:06 PM IST
సంపూతో క్రిష్ సినిమా తీయబోతున్నాడా..?

సారాంశం

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు సంపూతో ఓ కామెడీ సినిమా తీయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు క్రిష్.. సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.   

కామెడీ హీరో సంపూర్నేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజైన తరువాత సినిమాకి లాభాలొచ్చాయి.

ఈ సినిమాతో పాటు విడుదలైన 'మన్మథుడు 2' డిజాస్టర్ అయితే 'కొబ్బరిమట్ట' మాత్రం లాభాలను రాబట్టగలిగింది. దీంతో సంపూ సినిమా బాగానే వర్కవుట్ అవుతుందని భావించిన సినీ నిర్మాతలు కొందరు అతడితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు సైతం సంపూతో ఓ కామెడీ సినిమా తీయాలని భావిస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు క్రిష్.. సంపూతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాకి క్రిష్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు నిర్మాత సి.కళ్యాణ్ కూడా సంపూతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సంపూర్నేష్ బాబు క్రేజ్ పెరుగుతుందనే చెప్పాలి!  

PREV
click me!

Recommended Stories

Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో
Allu Arjun: స్నేహారెడ్డిని అల్లు అర్జున్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? ఎవరికీ తెలియని నిజం చెప్పిన బన్నీ