ఒకటి కాదు రెండు...సంక్రాంతి బరిలో 'దిల్ రాజు' ట్రెండ్

Published : Jan 05, 2019, 09:57 AM ISTUpdated : Jan 05, 2019, 10:25 AM IST
ఒకటి కాదు రెండు...సంక్రాంతి బరిలో 'దిల్ రాజు' ట్రెండ్

సారాంశం

క్రితం సంవత్సరం  వచ్చిన వరస ఫ్లాఫ్ లను నుంచి బయిటపడటానికి 2019 ని వేదికగా చేసుకున్నారు దిల్ రాజు. అందులో భాగంగా సంక్రాంతి నుంచే పావులు కదపటం మొదలెట్టారు. ఈ సంక్రాతికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన ఎఫ్ 2 సినిమా, మరొకటి రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ.

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన వినయ విధేయ రామ నైజాం రైట్స్ తో పాటు ఆంధ్రాలో ఒక ప్రాంతం రైట్స్ ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని నమ్ముతున్నారు. తను నిర్మిస్తున్న సినిమాకు పోటీగా ఉన్న సినిమా పంపిణీ హక్కులు తీసుకోవటం ట్రేడ్ లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇలా దిల్ రాజు చేయటం మొదటి సారేం కాదు. 

ట్రేడ్ లెక్కల ప్రకారం..నైజాంలో వినయ విధేయ రామ కలెక్షన్స్ కు తిరుగుండదు. మరీ ముఖ్యంగా సినిమా ఏ మాత్రం బాగున్నా ఎన్టీఆర్ బయోపిక్ ని మించి ఆదరిస్తారు. దాంతో అందరూ దిల్ రాజు ది తెలివైన నిర్ణయం అని మెచ్చుకుంటున్నారు. 

ఇక దిల్ రాజు సంక్రాంతి తర్వాత కూడా పెద్ద సినిమాలతో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వనున్నారు. మహేష్ బాబు మహర్షి సినిమాతో ఆయన ఘన విజయం సాధించి, తిరిగి ఫామ్ లోకి వస్తాయని భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే