పవన్ తో సినిమా కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు!

Published : Sep 14, 2019, 11:12 AM ISTUpdated : Sep 14, 2019, 01:37 PM IST
పవన్ తో సినిమా కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు!

సారాంశం

ఈ మధ్యకాలంలో 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ తో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అందుకే దిల్ రాజు సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు.  

పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై తన దృష్టి మొత్తం రాజకీయాల మీద పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి పవన్ ని వెండితెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

తమిళంలో అజిత్ తో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అందుకే దిల్ రాజు సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు. మొదట్లో బాలయ్యతో రీమేక్ చేస్తాడని చెప్పారు కానీ సడెన్ గా పవన్ పేరుని తెర మీదకు తీసుకువచ్చారు.

పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయించడానికి త్రివిక్రమ్ కృషి చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ ఈ విషయమై పవన్ తో చర్చించాడట. త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఓ కారణం ఉందని అంటున్నారు. ఒకవేళ పవన్ గనుక ఒప్పుకుంటే దిల్ రాజుతో కలిసి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా చేస్తాడట.

పవన్ కళ్యాణ్ అయితే ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదని కానీ తప్పకుండా సినిమా చేస్తాడనే నమ్మకాన్ని దిల్ రాజు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. పవన్ ఈ సినిమా చేస్తున్నాడంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలనే ఇలా మీడియాకి ఫీలర్లు వదిలారని టాక్. మరి పవన్ రీఎంట్రీ ఈ సినిమాతో ఉంటుందో లేదో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?