దీపికకు మహేష్ హీరోయిన్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Published : Apr 27, 2019, 12:22 PM IST
దీపికకు మహేష్ హీరోయిన్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతారావు, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొన్ లకు ఒకరితో ఒకరికి చుట్టరికం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతారావు, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొన్ లకు ఒకరితో ఒకరికి చుట్టరికం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపిక కజిన్ బ్రదర్, అమృతారావ్ కజిన్ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకి రావడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల చుట్టరికం వెలుగు చూసింది. ఈ ఇద్దరు నటీమణులు తమ భర్తలతో కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదే ఫంక్షన్ లో రణవీర్.. దీపిక చెప్పులను తీసుకొని చేతిలో పట్టుకొని నడవం చూసిన అభిమానులు రణవీర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీపికకి మంచి భర్త దొరికాడంటూ  కామెంట్స్ పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?