దేత్తడి హారిక ఎలిమినేటెడ్‌.. సీక్రెట్‌ హౌజ్‌లోకి?

Published : Sep 20, 2020, 05:03 PM IST
దేత్తడి హారిక ఎలిమినేటెడ్‌.. సీక్రెట్‌ హౌజ్‌లోకి?

సారాంశం

రెండో ఎలిమినేటర్‌ ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కుమార్‌ సాయి, అమ్మా రాజశేఖర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్‌ కాబోతున్నారని ఊహాగనాలు వినిపిస్తున్నాయి. 

బిగ్‌బాస్‌4 ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. రెండో వారంలో ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారనే విషయాన్ని బిగ్‌బాస్‌ నాగార్జున శనివారం స్పష్టం చేశారు. అంతేకాదు రెండో వారం ఫస్ట్ ఎలిమినేషన్‌గా కరాటే కళ్యాణిని ఇంటికి పంపించేశాడు. రెండో ఎలిమినేషన్‌ ఆ రాత్రి ఉండబోతుంది.

రెండో ఎలిమినేటర్‌ ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కుమార్‌ సాయి, అమ్మా రాజశేఖర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్‌ కాబోతున్నారని ఊహాగనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఓ ట్విస్ట్ చోటుచేసుకోబోతుందట. ఎవరూ ఊహించిన విధంగా దేత్తడి హారిక ఎలిమినేట్‌ కాబోతుందని తెలుస్తుంది. 

అయితే ఆమెని పూర్తిగా హౌజ్‌ నుంచి పంపించేయకుండా ఓ సీక్రెట్‌ హౌజ్‌లో ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సీక్రెట్‌ హౌజ్‌లో ఆమె ఏం చేయబోతుంది? అందులో పెట్టడానికి రీజన్‌ ఏంటి? అనేది రాత్రి నాగ్‌ వివరిస్తాడని సమాచారం. 

మరి ఆమె ప్రత్యేకమైన ఎలిమినేటరా? లేక రెండో వారం రెండో ఎలిమినేటరా? అన్నది సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా ఈ ఆదివారం `బిగ్‌బాస్‌4` మరింత రసవత్తరంగా సాగబోతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్