మామకు భయపడకు.. రజనీ చాలా కూల్.. సౌందర్య భర్తతో ధనుష్!

Published : Jun 08, 2019, 03:13 PM IST
మామకు భయపడకు.. రజనీ చాలా కూల్.. సౌందర్య భర్తతో ధనుష్!

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇది రెండో వివాహం. ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత తనయుడు అయిన విశాగన్ ని సౌందర్య వివాహం చేసుకుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇది రెండో వివాహం. ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత తనయుడు అయిన విశాగన్ ని సౌందర్య వివాహం చేసుకుంది. విశాగన్ కు కూడా ఇది రెండో వివాహమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనితో స్టార్ హీరో ధనుష్ కు విషగన్ తోడల్లుడు అయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధనుష్ మాట్లాడుతూ విశాగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మావయ్య రజనీకాంత్ ని విశాగన్ కలవక ముందు అతడికి ఓ సలహా ఇచ్చా. అంతా బాగానే జరుగుతుంది.. టెన్షన్ పడొద్దు అని చెప్పా. ఇది అందరూ చెప్పే మాటే. మరో విషయం కూడా చెప్పా. రజనీకాంత్ లాంటి పెద్ద వ్యక్తిని కలిసే సమయంలో చాలామంది కాస్త భయానికి గురవుతారు. రజనీకాంత్ దగ్గర బయపడకు. ఆయన చాలా కూల్ గా ఉంటారు. ఆయన నీ దగ్గరకు వస్తే సైలెంట్ గా ఉండు చాలు.. ఇక అంతా రజినినే చూసుకుంటారు అని విశాగన్ కు చెప్పినట్లు ధనుష్ తెలిపాడు. 

2010లో సౌందర్య రజనీకాంత్ అశ్విన్ ని వివాహం చేసుకుంది. విభేదాల కారణంగా వీరిద్దరూ 2017లో విడిపోయారు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. సౌందర్య రజనీకాంత్ పలు చిత్రాలకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. కొచ్చాడియాన్ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే