పివి సింధు కామెంట్ పై దీపికా రియాక్షన్!

Published : Sep 10, 2019, 10:02 AM IST
పివి సింధు కామెంట్ పై దీపికా రియాక్షన్!

సారాంశం

దీపికా టాలెంట్ తో పాటు ఎంతో అందంగా ఉంటారని ఆమె గురించి గొప్పగా మాట్లాడారు పీవీ సింధు. ఈ ఇంటర్వ్యూ చదివిన దీపికా.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా తను దీపికాను ఎంతగానో అభిమానిస్తానని చెప్పుకొచ్చింది. 

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న తరువాత సింధు ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనకు మహేష్ బాబు, ప్రభాస్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకోన్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. దీపికా టాలెంట్ తో పాటు ఎంతో అందంగా ఉంటారని ఆమె గురించి గొప్పగా మాట్లాడారు.

ఈ ఇంటర్వ్యూ చదివిన దీపికా.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఇంటర్వ్యూ ఫోటోని షేర్ చేసి 'లవ్ యూ ఛాంప్' అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. సింధు బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ విషయంపై తన బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుందని పివి సింధుని ప్రశ్నించగా.. దానికి కూడా ఆమె దీపికా పదుకోన్ పేరు చెప్పింది. దీపిక కూడా ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని.. అలవాటు ఉన్న గేమ్ కాబట్టి తన పాత్రలో దీపిక అయితే బాగుంటుందని చెప్పింది సింధు. ప్రస్తుతం దీపికా 'ఛాపక్', '83' చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?