అభిమానం ఉండొచ్చు కాని.. అతి అభిమానం మంచిది కాదు అని స్టార్ హీరోలు కూడా తమ ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు హిత బోద చేస్తుంటారు. అయినా సరే కొంత మంది అభిమానులు కొత్తగా చేస్తున్నాము అనుకుంటూ.. వింత పనులు మాత్రం మానుకోవడం లేదు. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అలాంటిపనే చేశారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..?
అభిమానం ఉండొచ్చు కాని.. అతి అభిమానం మంచిది కాదు అని స్టార్ హీరోలు కూడా తమ ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు హిత బోద చేస్తుంటారు. అయినా సరే కొంత మంది అభిమానులు కొత్తగా చేస్తున్నాము అనుకుంటూ.. వింత పనులు మాత్రం మానుకోవడం లేదు. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అలాంటిపనే చేశారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..?
అభిమానం ఉండాలి కాని.. అది హద్దుల్లో ఉండాలి. అభిమాన నటుడికోసం ప్రాణాలైనా ఇవ్వడానికి కొంత మంది వెర్రెక్కినోళ్లు రెడీ అయిపోతుంటారు. అందరికంటే ప్రత్యేకం అనిపించుకోవడానికి వింత వింత పనులు చేస్తుంటారు. అయితే ఇలాంటివి కాస్త తమిళ పరిశ్రమలో ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా విజయ్ దళపతి అభిమానులు అలాంటిపనే చేశారు. జీవితంలో కొత్త బంధానికి.. నాందిపలికే నిశ్చితార్ధాన్ని విజయ్ లియో మూవీ నడుస్తున్న థియేటర్ లో చేసుకుని తాము ప్రత్యేకం అనిపించుకున్నారు. ఇక వివారాల్లోకి వెళ్తే..?
తమిళనాడులోని పుడుక్కోటి జిల్లాకు చెందిన వెంకటేశ్, మంజుల... దళపతి విజయ్‌కి వీరాభిమానులు. రీసెంట్ గా వీరిద్దరికి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తరువాత వీరు విజయ్ వీరాభిమానులని ఇద్దిరికి తెలిసింది. దాంతో ఇద్దరు కొన్ని విషయాలలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు.. విజయ్ నటించిన లియో రిలీజ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఎనిమిది నెలలుగా గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 19న లియో విడుదల కావడంతో.. ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 20న పెళ్లి పెట్టుకున్నారు.
In a couple exchanged their engagement ring and put Maalai on each other in front of in the morning show. pic.twitter.com/OsZMrh7iYm
— Iniya Nandan (@Iniyanandan25)అయితే అంతకు ముందు రోజు తమ ఆరాధ్య నటుడి సినిమాని కాబోయే కొత్త జంట థియేటర్‌లో వీక్షించింది. థియేటర్‌కు ట్రెడిషినల్ డ్రెస్ లో వచ్చిన వీరు.. లియో సినిమా ప్లే అవుతుండగానే.. ఆడియన్స్ ముందు.. దండలు, ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ లియో సినిమా విషయానికి వస్తే.. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది.
సంజయ్ దత్, అర్జున్, శాండీ, మిష్కిన్, గౌతమ్ మీనన్ లాంటి సెలబ్రెటీలు నటించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. దాదాపు 34 దేశాలకుపైగా రిలీజ్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అమెరికా, యూకే, దుబాయ్ ఇతర దేశాల్లో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రూ.50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లను తొలి రోజు వసూలు చేయవచ్చని సమాచారం.