ఇక కొట్టుకోలేం బిగ్ బాస్ గొడవలు పెట్టకండి... కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్

Published : Dec 04, 2020, 06:34 PM IST
ఇక కొట్టుకోలేం బిగ్ బాస్ గొడవలు పెట్టకండి... కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్

సారాంశం

టాస్క్ లో గెలవడానికి ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు మెంటల్ గా , ఫిజికల్ గా పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో నేడు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒకటి నుండి ఏడు వరకు ర్యాంక్ బోర్డ్ పెట్టి,  హౌస్ లో తమ ప్రదర్శన ఆధారంగా తమ ర్యాంక్ కోసం పోరాడాలని ఆదేశించాడు.

బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోగా ఇంటి సభ్యులకు పరీక్షలు కూడా కఠినంగా తయారయ్యాయి. టైటిల్ కావాలంటే చెమటోడ్చాలన్నట్లు బిగ్ బాస్ టాస్క్ లు నిర్వహిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటరైన మొత్తం 19మంది సభ్యుల నుండి ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈ ఏడుగురిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. కాగా నేరుగా ఒకరు ఫైనల్ కి చేరుకోవడాని బిగ్ బాస్ అవకాశం ఇవ్వడం జరిగింది. దీని కోసం బిగ్ బాస్ నిర్వహించిన మూడు టాస్క్ లు కంటెస్టెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. 

టాస్క్ లో గెలవడానికి ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు మెంటల్ గా , ఫిజికల్ గా పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో నేడు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఒకటి నుండి ఏడు వరకు ర్యాంక్ బోర్డ్ పెట్టి,  హౌస్ లో తమ ప్రదర్శన ఆధారంగా తమ ర్యాంక్ కోసం పోరాడాలని ఆదేశించాడు. అందరూ ఫస్ట్, సెకండ్ వంటి టాప్ ర్యాంక్స్ కోసం పోరాడుతారు కాబట్టి, మరలా ఇది యుద్దానికి దారి తీసింది. 

ఈ టాస్క్ ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇప్పటికే ఫిజికల్ గా, మెంటల్ గా గ్రిల్ అయిపోయామని అరియనా బిగ్ బాస్ కి చెప్పింది. ఇప్పుడే అందరం కలిసి హగ్ చేసుకున్నాం బిగ్ బాస్, ఇంతలోనే మరలా ఈ గొడవ అని సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోరాడి పోరాడి మాకు విసుగొచ్చేసింది, మావల్ల కాదని హారిక బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసింది. హౌస్ లో ఆడవాళ్లకు ఈ ఫిజికల్ టాస్క్ లు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం