'చిత్రలహరి'లో చిరు ఇన్వాల్వ్మెంట్!

Published : Nov 02, 2018, 01:06 PM IST
'చిత్రలహరి'లో చిరు ఇన్వాల్వ్మెంట్!

సారాంశం

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ ఆరంభంలో మూడు వరుస విజయాలు అందుకొని దూకుడు ప్రదర్శించాడు. కానీ ఆ విజయాలు ఎక్కువ రోజులు అతడిని ఆనందంలో ఉంచలేకపోయాయి. వరుసగా ఆరు ఫ్లాప్ సినిమాలు రావడంతో డీలా పడ్డాడు ధరం తేజ్. 

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ ఆరంభంలో మూడు వరుస విజయాలు అందుకొని దూకుడు ప్రదర్శించాడు. కానీ ఆ విజయాలు ఎక్కువ రోజులు అతడిని ఆనందంలో ఉంచలేకపోయాయి. వరుసగా ఆరు ఫ్లాప్ సినిమాలు రావడంతో డీలా పడ్డాడు ధరం తేజ్. మూడు నెలల పాటు సినిమాల నుండి బ్రేక్ కూడా తీసుకున్నాడు.

ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' అనే సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. 
సాధారణంగా సాయి ధరం తేజ్ సినిమాలను ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసి అప్పుడు తన సలహాలు ఇస్తుంటాడు చిరు.

కానీ ఈసారి తేజు స్క్రిప్ట్ విషయంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే చెప్పమని తన మావయ్య చిరంజీవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో స్క్రిప్ట్ పరిశీలించిన చిరు కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. చిరు చెప్పినట్లుగానే కథలో మార్పులు, చేర్పులు చేయమని దర్శకుడికి సూచించాడట ధరం తేజ్.

ప్రస్తుతం దర్శకుడు కిషోర్ తిరుమల అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తేజు సరసన హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మించనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?