
చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వాటిల్లో ఎక్కువ శాతం రీమేక్ లే ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో మరో మలయాళ రీమేక్ చేరనుందని టాక్. ఇప్పటికే చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ (2019)కి రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో ‘లూసిఫర్’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకుడు కూడా. ఇక మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి నటించిన మరో మలయాళ ఫిల్మ్ ‘బ్రో డాడీ’ (2022) తెలుగు రీమేక్‌లోనూ చిరంజీవి నటించనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
‘బ్రో డాడీ’కి కూడా పృథ్వీరాజే దర్శకుడు కావడం విశేషం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందని, ఇందులో మోహన్‌లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే చిరంజీవి కొడుకు పాత్రలో సాయి ధరమ్ తేజ చేసే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు సాయి డేట్స్ లాక్ చేసినట్లు సమాచారం. హరీష్ శంకర్ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారని వినపడుతోంది. ఫన్ డైలాగులతో ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైనట్లు వినికిడి. చిరంజీవి తమ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై ఈ చిత్రం నిర్మించ బోతున్నట్లు సమాచారం.
ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది. పెళ్ళికాకుండా హీరోతో లివింగ్ రిలేషన్ లో ఉండి హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అదే సమయంలో హీరో తల్లి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు, హీరో పెళ్లి ఎలా జరిగింది అనే కథాంశంతో సరదాగా తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే.. ‘గాడ్‌ఫాదర్’తో పాటు చిరంజీవి ప్రస్తుతం ‘బోళాశంకర్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ ‘బోళా శంకర్’ తమిళ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. మరి.. ‘బ్రో డాడీ’ రీమేక్‌కి చిరంజీవి ఎప్పుడు నుంచి మొదలెడతారు..అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఎప్పుడొస్తుంది..డైరక్టర్ హరీష్ శంకరేనా ? వంటి విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.